- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హారర్ థ్రిల్లర్‌తో రాబోతున్న నారా రోహిత్.. పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచేసిన మేకర్స్
నేడు నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

దిశ, సినిమా: నారా రోహిత్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పీడ్ పెంచారు. గతేడాది 'భైరవం' సినిమాతో భారీ విజయాన్ని అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఇప్పుడు ఆయన తన 21వ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. గన్నిరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని విజయ్ కృష్ణ నిర్మిస్తున్నారు. నేడు నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘కపాలి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. విడుదల చేసిన పోస్టర్‌లో నారా రోహిత్ హెడ్ కానిస్టేబుల్ గెటప్‌లో, తలపై ముళ్ల కిరీటంతో నుదిటిపై తిలకంతో కనిపించి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన వెనుక ఉన్న పోలీస్ వ్యాన్‌లో ముగ్గురు వ్యక్తులు గన్స్‌తో షూటింగ్ చేస్తుండగా, ఓ అమ్మాయి ఎరుపు రంగు కళ్ళతోమంత్రాలు, వింత ఆకృతులతో కూడిన డిజైన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఈ భయంకరమైన పోస్టర్ ద్వారా సినిమాహారర్ థ్రిల్లర్‌గా రాబోతున్నట్లు హింట్ ఇచ్చారు. అంతేకాకుండా "తెలియని దాని వైపు ప్రయాణం ఇక్కడ మొదలవుతుంది" అనే క్యాప్షన్ సినిమాపై మరింత కుతూహలాన్ని పెంచుతోంది. నారా రోహిత్ వైవిధ్యమైన లుక్, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ 'కపాలి' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.






