పెళ్లిపై నెటిజన్ ప్రశ్న.. శృతి హాసన్ రిప్లై ఏంటంటే?

by Mallepaka Hamsa |

తను ఇండస్ట్రీలోకి వచ్చి 17 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని జరుపుకుంటున్నానని, కానీ ఈ పెళ్లి ప్రశ్నకు మాత్రం గత 15 ఏళ్లుగా సమాధానం చెప్తూనే ఉన్నానని అన్నారు.

పెళ్లిపై నెటిజన్ ప్రశ్న..  శృతి హాసన్ రిప్లై ఏంటంటే?
X

దిశ, సినిమా: స్టార్ నటి, సింగర్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్న శృతి హాసన్ కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నారు. గత ఏడాది ‘కూలీ’చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఆమె ప్రస్తుతం ట్రైన్, సలార్-2, ఆకాశంలో ఒక తార వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఒకవైపు నటిగా రాణిస్తూనే, మరోవైపు సింగర్‌గానూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో విశేషాలను పంచుకుంటారు. సినిమా పరిశ్రమలోకి వచ్చి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శృతి హాసన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్ చాట్ చేశారు.

ఈ సందర్భంగా ఆమెకు పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. మీ పెళ్లి గురించి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా అని ఒక అభిమాని అడగ్గా.. శృతి స్పందిస్తూ, తను ఇండస్ట్రీలోకి వచ్చి 17 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని జరుపుకుంటున్నానని, కానీ ఈ పెళ్లి ప్రశ్నకు మాత్రం గత 15 ఏళ్లుగా సమాధానం చెప్తూనే ఉన్నానని అన్నారు. దయచేసి తనను పెళ్లి గురించి అడగొద్దని, ప్రస్తుతం తనకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని వెల్లడించారు. తన రాబోయే ప్రాజెక్ట్‌ల పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నానని, త్వరలోనే వాటికి సంబంధించిన అప్‌డేట్‌లను ప్రకటిస్తానని తెలిపారు.

Next Story