- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీటెక్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య
బీటెక్ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, ఇబ్రహీంపట్నం : బీటెక్ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం సీఐ మద్ది మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా బల్లేపల్లి గ్రామానికి చెందిన యమల కాసిం కుమార్తె మానస(20), రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని పూజారెడ్డి అనే హాస్టల్ లో ఉంటూ గురునానక్ విద్యాసంస్థలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుంది. కాగా ఆమె శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తన హాస్టల్ రూమ్ లో ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది. దీంతో సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మానస ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అని స్నేహితులు తెలిపారు. కానీ ఆమె ఆత్మహత్యకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






