తాండూర్ రైల్వే స్టేషన్‌లో 10 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

by Taduka Kalyani |

తాండూర్ రైల్వే స్టేషన్‌లో బ్యాగులో గుట్టుచప్పుడు కాకుండా ఎండు గంజాయిని తరలిస్తున్న ఓ మైనర్ బాలుడిని తాండూర్ పట్టణ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

తాండూర్ రైల్వే స్టేషన్‌లో 10 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
X

దిశ, తాండూర్ రూరల్: తాండూర్ రైల్వే స్టేషన్‌లో బ్యాగులో గుట్టుచప్పుడు కాకుండా ఎండు గంజాయిని తరలిస్తున్న ఓ మైనర్ బాలుడిని తాండూర్ పట్టణ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలుడు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో గంజాయిని తరలిస్తూ తాండూర్ రైల్వే స్టేషన్‌లో దిగాడు. ముందస్తుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బాలుడి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా సుమారు 10 కిలోల ఎండు గంజాయి లభించింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అనంతరం పంచనామా నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పరమేశ్వర్ గౌడ్ వెల్లడించారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story