- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపాలి: ఏడీఏ
ఎల్నినో ప్రభావం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రైతులు నష్టాలను చవిచూడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపాలని ఎల్లారెడ్డి డివిజన్ వ్యవసాయ శాఖాధికారి (ఏడీఏ) సుధా మాధురి పిలుపునిచ్చారు.

దిశ, తాడ్వాయి: ఎల్నినో ప్రభావం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రైతులు నష్టాలను చవిచూడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపాలని ఎల్లారెడ్డి డివిజన్ వ్యవసాయ శాఖాధికారి (ఏడీఏ) సుధా మాధురి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎర్రపహడ్ రైతు వేదికలో డివిజన్ స్థాయి అగ్రికల్చర్ అధికారుల రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏడీఏ సుధా మాధురి అధికారులతో కలిసి వ్యవసాయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు లేదా ఎల్నినో ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులను రైతులు ముందుగానే గుర్తించాలన్నారు. ఒకే రకమైన పంటలపై ఆధారపడి నష్టపోకుండా, తక్కువ నీటితో సాగు చేసే కంది, మొక్కజొన్న, కూరగాయలు, ప్రత్యామ్నాయ పంటలు స్వల్పకాలిక పంటల వైపు రైతులను సమాయత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.సబ్సిడీతో కూడిన కంది విత్తనాలు పంపిణి చేస్తామన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ రైతులకు తగిన సలహాలు,సూచనలు అందించాలని సూచించారు. బదిలీ పై వెళ్లిన వ్యవసాయ విస్తరణ అధికారులకు సన్మానం చేశారు. ఈ సమావేశంలో ఏడు మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






