జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

by Ratna Kumari |

జాతీయ రహదారి–365పై శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ సమీపంలో జాతీయ రహదారి–365పై శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొమ్మల విష్ణు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ప్రమాదంలో చంద్రుగూడెం గ్రామానికి చెందిన సదువాల భానుప్రకాశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన భానుప్రకాశ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story