ఐదు రోజుల్లో రిటైర్‌మెంట్.. అడ్డంగా దొరికిపోయిన దేవాదాయ శాఖ అధికారి

by Vemula.Srinu Prasad |

మరో ఐదు రోజుల్లో రిటైర్‌మెంట్ ఉండగా అవినీతికి పాల్పడి అధికారి అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన అనంతపురంలో జరిగింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జునప్రసాద్ మరో ఐదు రోజుల్లో రిటైర్ మెంట్ కాబోతున్నారు...

ఐదు రోజుల్లో రిటైర్‌మెంట్.. అడ్డంగా దొరికిపోయిన దేవాదాయ శాఖ అధికారి
X

దిశ, వెబ్ డెస్క్: మరో ఐదు రోజుల్లో రిటైర్‌మెంట్ ఉండగా అవినీతికి పాల్పడి అధికారి అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన అనంతపురంలో జరిగింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జునప్రసాద్ మరో ఐదు రోజుల్లో రిటైర్ మెంట్ కాబోతున్నారు. అయితే లాస్ట్ సారిగా లంచం తీసుకుందామనుకున్నారు. కానీ ఏసీబీ అధికారులు ఇచ్చిన షాక్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది. పుట్లూరు మండలం రామలింగాపల్లి గ్రామంలోని వెంకటరమణ ఆలయానికి టీటీడీ నుంచి రూ. 10 లక్షలు మంజూరు అయ్యాయి.

రూ.3 లక్షల చెక్కు ఇచ్చేందుకు లంచం

అయితే గతంలో రూ. 7 లక్షలు మంజూరు కాగా మిగిలిన రూ.3 లక్షల చెక్కు సదరు మల్లికార్జున ప్రసాద్ వద్దకు చేరింది. అయితే ఈ చెక్కు ఇచ్చేందుకు ప్రసాద్ రూ.25 వేలు ఇవ్వాలని ఆలయ ట్రస్ట్ వెంకటరామిరెడ్డిని డిమాండ్ చేశారు. దేవుడి సొమ్మును లంచంగా ఇవ్వడం ఇష్టంలేని వెంకటరామిరెడ్డి నేరుగా ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పక్కాగా స్కెచ్ వేసి మల్లికార్జున ప్రసాద్‌ను ట్రాప్ చేశారు. దీంతో లంచం తీసుకుంటుండగా ప్రసాద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పదవీ విమరణకు ముందు ఇలా జరగడంతో ఆయన ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తదుపరి చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.

Next Story