- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని మోడీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి గంజి మైదాన్ లోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు.

దిశ, సంగారెడ్డి అర్బన్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి గంజి మైదాన్ లోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ, బీజేపీ అధికారంలో ఉన్న ఢిల్లీ రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సాక్షిగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల తలలు పగలగొట్టారని ఆరోపించారు. విద్యార్థులపై జరిగిన ఈ పాశవిక దాడులను తీవ్రంగా ఖండించారు.కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లు ప్రధానమంత్రి నివాసం ముందు ధర్నా చేశారని తెలిపారు.రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన విధంగాప్రధాని మోడీ దేశంలోని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని లు డిమాండ్ చేశారు.రాహుల్ గాంధీ పోరాటానికి సంఘీభావంగా ఈ నిరసనలు నిర్వహిస్తున్నామని, రాహుల్ గాంధీ డిమాండ్లు నెరవేరే వరకు సంగారెడ్డిలో నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.వరుస నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం సాయంత్రం సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద గల రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద కాగడాల ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






