- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లికివందనం డబ్బు.. భార్యను కిరాతకంగా చంపిన భర్త
ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం డబ్బుల కోసం దారుణానికి ఒడిగట్టాడో భర్త.

దిశ, వెబ్‌డెస్క్ : ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం డబ్బుల కోసం దారుణానికి ఒడిగట్టాడో భర్త. భార్య అకౌంట్లో ఇద్దరు పిల్లలకు సంబంధించిన తల్లికి వందనం డబ్బులు క్రెడిట్ అవ్వగా.. ఆ డబ్బులివ్వాలని టార్చర్ చేశాడు. ఆమె ససేమిరా ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో.. గొంతుకోసి చంపేశాడు. ఈ ఘోరం అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం రాపూరివారిపల్లి పంచాయతీలోని కొత్తపల్లి గ్రామ సమీపంలో జరిగింది. పద్మావతి, సురేష్ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. ప్రణీత్ 5వ తరగతి, విష్ణు 3వ తరగతి చదువుతున్నారు. ఇటీవలే రాష్ట్రప్రభుత్వం తల్లికివందనం డబ్బులను తల్లుల ఖాతాల్లో వేయగా.. ఆ డబ్బు కోసం ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆ డబ్బులు తనకు ఇవ్వాలని సురేష్ గత రాత్రి పద్మావతితో గొడవపడ్డాడు. దాంతో కోపంతో ఊగిపోయిన సురేష్.. విచక్షణ కోల్పోయి పద్మావతి గొంతుకోసి చంపాడు. గతంలోనూ పద్మావతిని డబ్బుల కోసం చిత్రహింసలకు గురిచేశాడని, ఈసారి ప్రాణాలే తీసేశాడంటూ తల్లి కళావతి గుండెలవిసేలా రోదించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పద్మావతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవ్వగా.. డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కళావతి ఫిర్యాదు మేరకు నిందితుడు సురేష్ పై హత్యకేసు నమోదు చేశారు.






