అటవీ భూములు దున్నితే కఠిన చర్యలు

by Ratna Kumari |

మహాముత్తారం మండలంలో అటవీ భూములను అక్రమంగా ఆక్రమించడం, దున్నడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మహాముత్తారం ఎస్‌ఐ గొర్ల రమేష్ హెచ్చరించారు.

అటవీ భూములు దున్నితే కఠిన చర్యలు
X

దిశ, మహాముత్తారం : మహాముత్తారం మండలంలో అటవీ భూములను అక్రమంగా ఆక్రమించడం, దున్నడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మహాముత్తారం ఎస్‌ఐ గొర్ల రమేష్ హెచ్చరించారు. శుక్రవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహాముత్తారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఆజాంనగర్, పెగడపల్లి, కాటారం అటవీ రేంజ్ అధికారులతో కలిసి డోజర్లు (బ్లేడ్ బండ్లు), ట్రాక్టర్ యజమానులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. అటవీ భూములను ఆక్రమించడం, సాగు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు.

అక్రమంగా అటవీ భూములు దున్నిన వారిపై అటవీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు, ఇందుకు ఉపయోగించిన ట్రాక్టర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు.అటవీ శాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, వారితో దురుసుగా ప్రవర్తించడం కూడా చట్టరీత్యా నేరమేనని, అలాంటి వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అటవీ భూముల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, చట్టాలను గౌరవించాలని ట్రాక్టర్ యజమానులకు సూచించారు. ఈ సమావేశంలో కాటారం, పెగడపల్లి, ఆజాంనగర్ అటవీ శాఖ అధికారులు, ట్రాక్టర్ యజమానులు పాల్గొన్నారు.

Next Story