అనారోగ్యంతో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు రవీందర్‌రెడ్డిని పరామర్శించిన కొప్పుల మహేష్‌రెడ్డి

by Ratna Kumari |

మండలంలోని నంచర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్‌రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

అనారోగ్యంతో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు రవీందర్‌రెడ్డిని పరామర్శించిన కొప్పుల మహేష్‌రెడ్డి
X

దిశ, మహమ్మదాబాద్ : మండలంలోని నంచర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్‌రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కొప్పుల మహేష్‌రెడ్డి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్యుల సూచనలు పాటిస్తూ తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గోపాల్, వెంకటయ్య, తిరుమలరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజ్, వెంకటేష్, సాయి, ఆంజనేయులు, దస్తయ్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story