డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 55 మందికి జరిమానా.. ఒకరికి 14 రోజుల జైలు శిక్ష

by Taduka Kalyani |

ఉస్మానియా యూనివర్సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 55 మందిని శుక్రవారం నాంపల్లిలోని VIII జేఎంఎఫ్‌సీ (డ్రంక్ అండ్ డ్రైవ్) కోర్టులో హాజరుపరిచారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 55 మందికి జరిమానా.. ఒకరికి 14 రోజుల జైలు శిక్ష
X

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 55 మందిని శుక్రవారం నాంపల్లిలోని VIII జేఎంఎఫ్‌సీ (డ్రంక్ అండ్ డ్రైవ్) కోర్టులో హాజరుపరిచారు. మొత్తం రూ.2,85,500 జరిమానా విధించగా, 49 మందికి ఒక్కొక్కరికి రూ.5,100, ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.7,100, మరో వ్యక్తికి రూ.100 జరిమానా విధించారు. అదేవిధంగా రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ నేరానికి పాల్పడిన సుఫియాన్ (36), ఎం.కే. నగర్ నివాసికి కోర్టు 14 రోజుల జైలు శిక్ష విధించింది. అతను ఏపీ29 టిబి 3304 నంబర్ గల నాలుగు చక్రాల వాహనాన్ని మద్యం మత్తులో నడుపుతూ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. కోర్టులో హాజరైన వారిలో 45 మంది ద్విచక్ర వాహనదారులు, నలుగురు త్రిచక్ర వాహనదారులు, ఆరుగురు నాలుగు చక్రాల వాహనదారులు ఉన్నారు. మొత్తం కేసుల్లో 54 కేసులు 2026 సంవత్సరానికి, ఒక కేసు 2025 సంవత్సరానికి చెందినవిగా అధికారులు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఓయూ ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ హెచ్చరించారు.

Next Story