- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్గొండ జిల్లా మీ రాజ్యం అనుకుంటున్నారా? రాజగోపాల్ రెడ్డిపై మందుల సామేల్ ఫైర్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మరోసారి ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లా మీ రాజ్యం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మరోసారి ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లా మీ రాజ్యం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తమ గురించి ఎందుకు హీనంగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. వీరేశం 60వేల మెజారిటీతో, తాను 50వేల మెజారిటీతో గెలిచామని చెప్పారు. మీ దగ్గర మేము చేతులు చాచి గెలవలేదని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలు బాగాలేవు అని అంటున్నాడు.. ముందు ఆయన మునుగోడు పరిస్థితిని చూసుకోవాలన్నారు. మునుగోడులో అభివృద్ధి జరగలేదు, పరిస్థితి బాగాలేదని తనకు కూడా రిపోర్ట్ వచ్చిందన్నారు. రాజగోపాల్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలన్నారు.
రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోయి, రాహుల్ గాంధీని తిట్టి, ఎన్నికలప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చాడని అన్నారు. రెండు మంత్రి పదవులు మిగిలి ఉన్నాయని వాటిలో ఒకటి లంబాడి సామాజికవర్గానికి, మరొకటి యాదవ సామాజికవర్గానికి చెందినవారికి ఇవ్వాలని ముఖ్యమంత్రికి సూచించారు. లంబాడాలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని కాబట్టి వారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పారు. తన హక్కులను హరించిందుకు రాజగోపాల్ రెడ్డిపై రాహుల్ గాంధీ, ఖర్గేలకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. తాను తెలంగాణ పోరాటయోధుడనని తనపై పెత్తనం ఏంటని ప్రశ్నించారు. తొమ్మిది మంది మండల అధ్యక్షులను తానే ప్రకటించానని ఆపే దమ్ము నీకు ఎవరు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో వేలు పెడితే పనికిరాకుండా చేస్తానని హెచ్చరించారు.






