- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనానికి స్పందన.. రైతులు రాకపోవడం వల్లనే రైతుబజార్ మూసివేత
దిశ పత్రికలో "మాకేం సంబంధం లేదు" అనే శీర్షికన గురువారం ప్రచురితమైన కథనంపై వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు స్పందించారు.

దిశ, కామారెడ్డి: కామారెడ్డి గంజ్ మార్కెట్ యార్డులో గత ప్రభుత్వ హయాంలో రూ.50 లక్షలు వెచ్చించి రైతుల కోసం నిర్మించిన రైతు బజార్ నిరూపయోగంపై "దిశ" పత్రికలో "మాకేం సంబంధం లేదు" అనే శీర్షికన గురువారం ప్రచురితమైన కథనంపై వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు స్పందించారు. రైతు బజార్ లో కొనుగోలు దారులు రాకపోవడంతో రైతులు కూరగాయలు విక్రయించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కనీస వసతులు లేకపోవడం, ప్రజల ఆదరణ లేకపోవడమే కారణమని మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. 2018 సంవత్సరంలో కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రైతులు పండించిన కూరగాయలను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునేందుకు రైతు బజారును నిర్మించినట్లు ఆయన వివరించారు. వినియోగదారులు రాకపోవడంతో రైతులు కూడా రైతు బజారును వినియోగించడం మానేశారని పేర్కొన్నారు.
కలెక్టర్ నుంచి పరిపాలనా అనుమతి కోసం..
ఈ విషయంపై 05-10-2018న జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయడంతో పాటు స్థానిక మునిసిపల్ అధికారులు, పోలీసుల సహకారంతో రైతు బజారును పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. 2019 డిసెంబర్ నుంచి కోవిడ్ కారణంగా స్థానిక కూరగాయల మార్కెట్‌ను సీఎస్ఐ గ్రౌండ్‌కు తరలించామని, అక్కడ మున్సిపాలిటీ వారు తైబజార్ వసూలు చేస్తున్నారని అన్నారు. 20-07-2023న హైదరాబాద్‌లో జరిగిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సమీక్ష సమావేశంలో అప్పటి రైతు బజారును కమర్షియల్ కాంప్లెక్స్‌గా మార్చాలని ఆదేశాలు వచ్చాయని స్పష్టం చేశారు. దీంతో 09-10-2023న జిల్లా అదనపు కలెక్టర్ కమర్షియల్ కాంప్లెక్స్‌గా మార్చాలని ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించారు. 2021లో సమీకృత మార్కెట్ నిర్మాణం కోసం మార్కెట్ యార్డులోని 3.00 ఎకరాల స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించినట్లు తెలిపారు. ప్రస్తుతం సమీకృత మార్కెట్ నిర్మాణం జిల్లా కలెక్టర్ నుంచి పరిపాలనా అనుమతి కోసం పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. రైతు బజారును వినియోగించుకునేందుకు రైతులు, వినియోగదారులు ముందుకు రాకపోవడం వల్లే అది వినియోగంలో లేకుండా పోయిందని అధికారులు స్పష్టం చేశారు.






