బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్..

by Kodari Anjali |

నాగిరెడ్డిపేట్ మండలంలోని బంజారా తండా గ్రామా సర్పంచ్ సురేష్ బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్..
X

దిశ, నాగిరెడ్డిపేట్: నాగిరెడ్డిపేట్ మండలంలోని బంజారా తండా గ్రామ సర్పంచ్ సురేష్, మెల్లకుంట తాండా గ్రామ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, అలాగే గ్రామ అధ్యక్షులు మోహన్ నాయక్ తమ అనుచరులతో కలిసి శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్యానించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై, నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ చేస్తున్న అభివృద్ధి ఆకర్షితులమై బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు.

Next Story