రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం..

by Kodari Anjali |   (  Updated:2026-07-24 13:51:08  IST  )

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన ఏదులాపురం మున్సిపాలిటీలో చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం..
X

దిశ, ఖమ్మం రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన ఏదులాపురం మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన వలిమల గోపినాథ్(25) గత సంవత్సరం నుంచి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గల ఆశోక్లేల్యాండ్ షోరూమ్ లో టెక్నిషియన్గా పనిచేస్తున్నాడు. గోపినాథ్ శుక్రవారం ఉదయం ఇంటి నుంచి డ్యూటీకి తన టూ వీలర్ పై వస్తుండగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని బీలీఫ్ హస్పిటల్ సమీపంలోకి రాగానే వెనుకు నుంచి అతివేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో గోపినాథ్ తన బైక్ పై నుంచి రోడ్డు మీద పడగానే వేగంగా వచ్చిన లారీ నడుము మీద నుంచి వెళ్లడంతో శరిరరం రెండు బాగాలుగా తెగిపడి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ ముష్కరాజు సంఘటన స్థలానికి చెరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ హస్పిటల్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Next Story