- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకోవడానికి శని, ఆది వారాల్లో ప్రత్యేక శిబిరాలు
ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకోవడానికి, పూర్తి చేసి తిరిగి ఇవ్వడానికి శని, ఆదివారాలలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు నియోజకవర్గ ఎలక్ట్రోల్ ఆఫీసర్, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

దిశ, రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో శని, ఆది వారాల్లో ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకోవడానికి, పూర్తి చేసి తిరిగి ఇవ్వడానికి శని, ఆదివారాలలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు నియోజకవర్గ ఎలక్ట్రోల్ ఆఫీసర్, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గం పరిధిలో 6,35,283 మంది ఓటర్లుండగా ఇప్పటి వరకు 3,26,785 మంది ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకుని (డిజిటలైజెడ్) ఆన్ లైన్ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 51.44 శాతం పూర్తయిందన్నారు. ఇంకా 2,78,670 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు రావాల్సి ఉన్నాయన్నారు. 29, 828 మంది ఓటర్ల అడ్రస్ లు తెలియడం లేదన్నారు.
ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
శని, ఆదివారాలలో అన్ని బస్తీలలో ఉన్న పోలింగ్ బూత్ ల వద్ద, బస్తీ ప్రధాన కూడళ్ల వద్ద, కాలనీలలో, కమ్యూనిటీ హాల్ లలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరాలలో బీ ఎల్ ఓ లు, వివిధ విభాగాల సిబ్బంది అందుబాటులో ఉండి ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకుంటారన్నారు. ఈ రెండు రోజులలో ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి ఇవ్వాలన్నారు. ఆలస్యం చేస్తే ఓటు పోయే ప్రమాదం ఉందన్నారు. ఆగస్టు 3 తర్వాత ఓటరుగా నమోదు కావాలంటే అడ్రస్ ప్రూఫ్ లాంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 3 లోగా ఎన్యూమరేషన్ ఫారాలను ఇచ్చినట్లయితే సులభంగా ఓటరు జాబితాలో పేరు నమోదు అవుతుందని నియోజకవర్గం ఎలక్ట్రోల్ ఆఫీసర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత పేరు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలంటే అడ్రస్ ఫ్రూఫ్, వయస్సు ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. అందుకే సులభంగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి త్వరగా తమ ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకుని పూర్తి చేసి ఇవ్వాలని సోలిపేట శ్రీనివాస్ రెడ్డి కోరారు.






