విద్యార్థుల చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి

by Taduka Kalyani |

విద్యార్థుల చదువుతో పాటు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు.

విద్యార్థుల చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి
X

దిశ, ఆసిఫాబాద్ : విద్యార్థుల చదువుతో పాటు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో నేరుగా ముచ్చటించి వారి అభ్యసన సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. వంటశాల భోజన వసతులను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. అనంతరం ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని ప్రతి మొక్కనూ దత్తత తీసుకొని వాటిని సంరక్షించాలన్నారు.

Next Story