రాధాగాయత్రి మృతి కేసు : భర్తకు రిమాండ్ పొడిగింపు

by Naga Rani Yarlagadda |

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Techie) రాధాగాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

రాధాగాయత్రి మృతి కేసు : భర్తకు రిమాండ్ పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Techie) రాధాగాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆమె భర్త శ్రీచరణ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ముస్సోరీ కోర్టు తోసిపుచ్చింది. కేసు తీవ్రత, పోలీసుల దర్యాప్తు పురోగతిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాకుండా.. శ్రీచరణ్‌కు విధించిన న్యాయస్థాన సంబంధిత రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని తిరిగి జైలుకు తరలించారు. రాధాగాయత్రి మృతిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, కేసులోని అన్ని కోణాలను క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రాధాగాయత్రి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని ముస్సోరీలోనే న్యాయపోరాటం చేస్తున్నారు.

Next Story