రిలీజ్‌కు ముందే మెగా హీరో రికార్డ్..‘కొరియన్ కనకరాజు’ కు కోట్ల వ‌ర్షం!

by velandi.Saikiran |

రిలీజ్‌కు ముందే ‘కొరియన్ కనకరాజు’ కు కోట్ల వ‌ర్షం కురుస్తోంది.

రిలీజ్‌కు ముందే మెగా హీరో రికార్డ్..‘కొరియన్ కనకరాజు’ కు కోట్ల వ‌ర్షం!
X

దిశ‌, వెబ్ డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్, కామెడీ, లవ్ ట్రాక్ లో చాలా సినిమాలే చేశారు వరుణ్. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమా ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు వరుణ్. ఇందులో భాగంగానే ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తోంది. అయితే రిలీజ్ కంటే ముందు... ‘కొరియన్ కనకరాజు’ సినిమా బాక్సాఫీస్ ముందు సత్తా చాటుతోంది.. పాటలు, టీజర్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకొని.. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఏకంగా రూ.26 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సినిమా వాస్తవానికి రూ.38 కోట్ల బడ్జెట్ తో తీశారు. అంతలోనే రూ.26 కోట్లు రావడం హర్షించదగ్గ విషయమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే... బాక్సాఫీస్ వద్ద ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా ఆగస్టు 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

Next Story