- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోబోలకూ టచ్ ఫీల్..! కొత్త టెక్నాలజీని డెవలప్ చేసిన నిపుణులు
రోబోలకు సైతం అలాంటి ‘టచ్ ఫీల్’ ఇచ్చే సాంకేతికతను నిపుణులు డెవలప్ చేశారు.

దిశ, ఫీచర్స్ : ఏదైనా స్పర్శ తగిలినప్పుడు దానిని అనుభూతి చెందడం, స్పందించడం వంటి లక్షణాలు మానవుల్లో సహజం. కానీ ఇప్పుడు రోబోలకు సైతం అలాంటి టచ్ ఫీల్ ఇచ్చే సరికొత్త ఆవిష్కరణకు తెరతీశారు లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన సాంకేతిక పరిశోధకులు(ఇంజినీర్లు). అంటే.. అవి స్పర్శను అనుభవించినట్లు తెలిసేందుకు సహాయపడే రంగు మార్చే సెన్సార్‌ను డెవలప్ చేశారు. వీటి ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన రోబోల తయారీలో అవి వస్తువులను పట్టుకోవడం లేదా తాకడం కోసం వేలాది చిన్న చిన్న ఎలక్ట్రానిక్ సెన్సార్లను అమర్చేవారు. కానీ ఇప్పుడు డెవలప్ చేసిన ఈ టచ్ ఫీల్ మెటీరియల్ రోబోలు దేనినైనా తాకినప్పుడు తన రంగును మార్చేస్తుంది. ఆ రంగు మార్పును ఒక సాధారణ కెమెరా సులభంగా చూసి, రోబో ఎక్కడ తాకింది. ఎంత ఒత్తిడి ఇచ్చింది. ఎంత లాగింది అన్నీ రియల్ టైమ్‌లోనే తెలుసుకుంటుంది. ఈ కొత్త పద్ధతి చాలా సింపుల్ & తక్కువ ఖర్చుతో కూడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పైగా ఇంతకు ముందు ఉపయోగించే కాంప్లెక్స్ కంప్యూటర్ అల్గారిథమ్‌లు అవసరం లేదు. రంగు మారిన చోటును కెమెరా చూస్తే చాలు. ఇది రోబోట్లను మరింత త్వరగా, ఖచ్చితంగా పని చేసేలా చేస్తుంది.
ఉపయోగాలు ఏమిటి?
*ఫ్యాక్టరీల్లో సూక్ష్మమైన ప్రొడక్ట్స్ తయారు చేసేటప్పుడు వీటి అవసరం ఏర్పడుతుంది
*కృత్రిమ చేతులు (Robotic prosthetics) ఉపయోగించే వ్యక్తులకు కూడా అవసరం కావచ్చు
*శస్త్రచికిత్సల్లో రోబోలు ఉపయోగించేటప్పుడు దీని అవసరం ఏర్పడుతుంది
*రోబోలు సెన్సిటివ్ వస్తువులను పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా, మానవుల్లాగా పని చేయగలుతాయి. ఈ ఆవిష్కరణ రోబోటిక్స్ రంగంలో పెద్ద మార్పు తీసుకువస్తుందని నిపుణులు చెబుతున్నారు. రంగుల ద్వారా స్పర్శను ‘చూడగలగడం’ రోబోలను మానవులకు ఇంకా దగ్గర చేస్తుందని అంటున్నారు.






