హోండా అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌.. ఒకేసారి 10 మోడళ్ల ఆవిష్కరణ

by velandi.Saikiran |

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కీలక ప్రకటన చేసింది.

హోండా అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌.. ఒకేసారి 10 మోడళ్ల ఆవిష్కరణ
X

దిశ‌, వెబ్ డెస్క్: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఒకేసారి పది కొత్త టూ వీలర్స్ ఆవిష్కరించి.. అందరికీ షాక్ ఇచ్చింది. ఇందులో ఏడు కొత్త మోడల్స్ కాగా... మూడు మాత్రం అప్డేట్ వెర్షన్ మోడల్స్ ఉన్నాయి. ఇక వీటి ధరలు, రిలీజ్ తేదీలను త్వరలోనే దశలవారీగా ప్రకటించనున్నారు. ఈ ప‌ది ర‌కాల బైక్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

CB 500 : రెట్రో డివిజన్ తో కూడిన ఈ ప్రీమియం రోడ్ స్టర్... 501 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ తో రానుంది. స్పోక్ ట్యూబ్ లెస్, అలాయ్, గ్రాఫిక్స్ తో కూడిన స్పోక్ ట్యూబ్ లెస్ అనే మూడు అందుబాటులోకి వస్తుంది.

ADV 160: 157cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్, 'SUV-ప్రేరేపిత' డిజైన్, 8.1-లీటర్ల ఇంధన ట్యాంక్, సీటు కింద 27-లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం, డిస్క్ బ్రేకులు (ముందు/వెనుక) , హోండా టార్క్ కంట్రోల్, TFT స్క్రీన్ ఈ బైక్ కు అందించ‌నున్నారు.

రెబెల్ 500: సింపుల్ సీటు, వెడల్పాటి టైర్లు, న‌లుపు రంగులో రానున్న ఈ బైక్‌ 471cc ఇన్-లైన్-ట్విన్ వాటర్-కూల్డ్ ఇంజన్ క‌లిగి ఉంటుంది.

రెబెల్ 300: 286cc వాటర్-కూల్డ్ ఇంజన్, స్టాండర్డ్, ఇ-క్లచ్ వేరియంట్లు రానున్నాయి.

XR 300: 293cc ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజిన్, గ్యాస్-ఛార్జ్డ్ రియర్ సస్పెన్షన్, హోండా టార్క్ కంట్రోల్, డిస్క్ బ్రేకులు (ముందు/వెనుక), స్విచబుల్ డ్యూయల్-ఛానల్ ABS అందిస్తున్నారు.

హోండా CB500: 501cc సింగిల్-సిలిండర్, ఆయిల్ కూలర్‌తో కూడిన ఎయిర్-కూల్డ్ ఇంజన్, ఆల్-LED లైటింగ్, డ్యూయల్-ఛానల్ ABS, అల్లాయ్ & స్పోక్ ట్యూబ్‌లెస్ వీల్ ఆప్షన్లు రానున్నాయి.

XR300L: ఆయిల్ కూలర్‌తో కూడిన 293.5cc ఎయిర్-కూల్డ్ ఇంజన్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, స్విచ్చబుల్ డ్యూయల్-ఛానల్ ABS, రెండు వైపులా డిస్క్ బ్రేకులు వ‌స్తాయి.

XR 300 Rally: ఆయిల్ కూలర్‌తో కూడిన 293.5cc ఎయిర్-కూల్డ్ ఇంజన్, ర్యాలీ-ప్రేరేపిత ఫెయిరింగ్ అందించ‌నున్నారు.

హోండా QC3 ఎలక్ట్రిక్ స్కూటర్: 3.0 kWh బ్యాటరీ, 145 కి.మీ. IDC క్లెయిమ్డ్ రేంజ్, సీటు కింద 32-లీటర్ల స్టోరేజ్, హోండా రోడ్‌సింక్‌తో కూడిన TFT డిస్‌ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, హోండా స్మార్ట్ కీ అందించ‌నున్నారు.

Next Story