- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేపల వేటకు వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి..
by Taduka Kalyani |
బజార్‌హత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామానికి చెందిన చౌరే అరుణ్ (45) అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

X
దిశ, బజార్‌హత్నూర్, జూలై 24: బజార్‌హత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామానికి చెందిన చౌరే అరుణ్ (45) అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం, దేగామ చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన అరుణ్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, బోథ్ సీఐ గురుస్వామి సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రాత్రి సమయం కావడంతో మృతదేహం ఇంకా లభ్యం కాలేదని సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Next Story






