- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జహీరాబాద్-సంగారెడ్డి రహదారిని ఆరు లేన్లకు విస్తరించాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి జహీరాబాద్ ఎమ్మెల్యే కోనింటి మాణిక్‌రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుక్రవారం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌ను కలిసి జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రతిపాదనలపై వినతిపత్రాలు అందజేశారు...

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి జహీరాబాద్ ఎమ్మెల్యే కోనింటి మాణిక్‌రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుక్రవారం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌ను కలిసి జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రతిపాదనలపై వినతిపత్రాలు అందజేశారు. కేంద్ర మంత్రి గడ్కరీకి సమర్పించిన వినతిపత్రంలో జాతీయ రహదారి 65లో జహీరాబాద్–సంగారెడ్డి మార్గాన్ని నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లకు విస్తరించాలని కోరారు. జహీరాబాద్ పారిశ్రామిక కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ భారీగా పెరిగిందని, రహదారి విస్తరణతో ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు తగ్గడంతో పాటు పరిశ్రమలు, లాజిస్టిక్స్, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని వివరించారు.
అదే సందర్భంగా సదాశివపేట మండలంలోని నిజాంపూర్ ఎక్స్‌రోడ్డు, అరూర్ గ్రామ జంక్షన్‌ల వద్ద ఫ్లైఓవర్లు నిర్మించాలని ఎమ్మెల్యే ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ కూడళ్లలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున ప్రజల భద్రత, ట్రాఫిక్ సౌలభ్యం కోసం ఫ్లైఓవర్లు అత్యవసరమని తెలిపారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు కోహీర్ మండలం దిగ్వాల్ వద్ద ప్రతిపాదిత అండర్‌పాస్‌ను 25 మీటర్ల నుంచి 30 మీటర్లకు విస్తరించాలని, జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు, సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ, అవసరమైన చోట్ల బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని గడ్కరీని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌ను కలిసి సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్‌ను అమృత్ ధరోహర్ పథకం కింద ఎకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయడంతోపాటు మంజీరా వెట్‌ల్యాండ్‌కు అంతర్జాతీయ రామ్‌సార్ గుర్తింపు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శివకుమార్, భాస్కర్ పాల్గొన్నారు.






