బ్రూక్‌కు బిగ్ షాక్.. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్‌ ఎవ‌రంటే..!

by velandi.Saikiran |   (  Updated:2026-07-24 15:54:45  IST  )

బ్రూక్‌కు బిగ్ షాక్.. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్‌గా జో రూట్ ఫైన‌ల్ అయ్యారు.

బ్రూక్‌కు బిగ్ షాక్.. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్‌ ఎవ‌రంటే..!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెన్ స్టోక్స్ ఉన్నఫలంగా రిటర్మెంట్ ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడు. ఈ త‌రుణంలో జో రూట్ ను ఇంగ్లాండ్ కెప్టెన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రూక్ పేరు వినిపించినప్పటికీ రూట్ కు అవకాశం ఇచ్చేందుకు ఇంగ్లాండ్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వచ్చే సంవత్సరం యాషెస్ సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ కు రూట్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఆగస్టు 19వ తేదీ నుంచి పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ మూడు టెస్టుల సిరీస్ నేపథ్యంలో రూట్ మ‌రోసారి కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నారు. కాగా వ‌చ్చే యాషెస్ సిరీస్ ఇండియాలో జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది.

Next Story