‘రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం’: డిప్యూటీ సీఎం

by Kodari Anjali |   (  Updated:2026-07-24 15:53:02  IST  )

డిప్యూటీ సీఎం, భట్టి విక్రమార్క సిరిపురం మేజర్ కాలువను పరిశీలించారు.

‘రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం’:  డిప్యూటీ సీఎం
X

దిశ, ఏన్కూర్: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం సాయంత్రం మండల పరిధిలోని మేడేపల్లి సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ 52 కిలోమీటర్ల దగ్గర సిరిపురం మేజర్ కాలువ పనులను వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రెగ్యులేటర్ దగ్గర జరుగుతున్న పనులను ఎస్ ఈ,శ్రీనివాసరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. సుమారు 100 కోట్ల రూపాయలతో జరుగుతున్న సిరిపురం మేజర్ కాలువ పనులను పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఏన్కూర్ మండలంలోని నూకాలం పాడు, జన్నారం, శ్రీరామనగిరి, ఆరికాయలపాడు, మేజర్ కాలువలకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని, రైతుల సంక్షేమం కోసం ఎంత ఖర్చయినా వెనకాడే పరిస్థితి ఉండదని, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, సుడా చైర్మన్, పువ్వల దుర్గాప్రసాద్, సీతారామ ప్రాజెక్టు ఎస్ ఈ,శ్రీనివాసరెడ్డి, ప్రముఖ కాంట్రాక్టర్ మొగిలి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, స్వర్ణ నరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్, లచ్చి రామ్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ, చైర్మన్, భూక్య లాలు నాయక్, మాజీ ఎంపీటీసీ మేడ ధర్మారావు, లేళ్ల వెంకటరెడ్డి సామేలు, తదితరులు పాల్గొన్నారు. వి ఎం బంజర సీఐ, ముత్తిలింగం ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story