- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త రంగాల్లోకి సింగరేణి విస్తరించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సింగరేణి సంస్థను కేవలం బొగ్గు తవ్వకాలకే పరిమితం చేయకుండా రేర్ ఎర్త్ మినరల్స్, కీలక ఖనిజాల మైనింగ్‌తో పాటు కొత్త రంగాల్లోకి విస్తరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు.

దిశ, కొత్తగూడెం సింగరేణి: సింగరేణి సంస్థను కేవలం బొగ్గు తవ్వకాలకే పరిమితం చేయకుండా రేర్ ఎర్త్ మినరల్స్, లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల మైనింగ్‌తో పాటు కొత్త రంగాల్లోకి విస్తరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని ఆయన తెలిపారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే 15–20 ఏళ్లలో సోలార్, విండ్, హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వ్యవస్థల వినియోగం పెరగడంతో బొగ్గు వినియోగం తగ్గే అవకాశం ఉందన్నారు. అందుకే సింగరేణి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త రంగాల్లో అడుగుపెట్టాలని సూచించారు. ప్రైవేటు సంస్థలతో పోటీని తట్టుకునేందుకు నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి, వ్యయ నియంత్రణ, సమర్థవంతమైన నిర్వహణపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. అలాగే సింగరేణి బోర్డు సమావేశాల్లో సంస్థ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.






