- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిక్కడపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
by Taduka Kalyani |
చిక్కడపల్లి పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

X
దిశ,రాంనగర్ : చిక్కడపల్లి పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. చిక్కడపల్లి మెట్రో ఫ్లైఓవర్ కింద ఫుట్ పాత్ పై సుమారు 56-60 సంవత్సరాల వయస్సు గల వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి డయల్ 100 కు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే చిక్కడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు తెల్లటి కుర్తా పైజామా ధరించి ఉన్నాడు. అతని వివరాలు ఇంకా తెలియరాలేదు బాటసారుల రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఈ ఘటన జరగడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనారోగ్యమా లేక ఇతర కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






