అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. జాతకాలు పరిశీలిస్తున్నానని వార్నింగ్

by Vemula.Srinu Prasad |

అధికారుల పని తీరు, ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో దాదాపు 40 రకాల ప్రభుత్వ శాఖల తీరుతెన్నులపై ఆయన దిశానిర్దేశం చేశారు...

అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. జాతకాలు పరిశీలిస్తున్నానని వార్నింగ్
X

దిశ,వెబ్ డెస్క్: అధికారుల పని తీరు, ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో దాదాపు 40 రకాల ప్రభుత్వ శాఖల తీరుతెన్నులపై ఆయన దిశానిర్దేశం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రజాప్రతినిధులు, అధికారులు మనస్ఫూర్తిగా నడుచుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడంలో అధికారులు, రాజకీయ నాయకుల ఉమ్మడి బాధ్యత అని సీఎం పేర్కొన్నారు. పాలనలో వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు వేగంగా స్పందిస్తూ పరిగెత్తాలని, అలా లేని పక్షంలో తానే స్వయంగా వారితో పని చేయించి పరుగెత్తిస్తానని హెచ్చరించారు. 2029 ఎన్నికలలో 2024 కంటే మరింత మెజారిటీ లక్ష్యంగా పాలన సాగాలనిక సూచించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

పారదర్శకతకే ప్రాధాన్యం..

పాలనలో పారదర్శకతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపిన చంద్రబాబు.. ప్రగతి నివేదికల ఆధారంగా ప్రతి సోమవారం అధికారుల పని తీరును స్వయంగా పరిశీలిస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. అలాగే ఉచిత ఇసుక విధానం, ఇసుక సరఫరాలో అక్రమాలు, అవకతవకలు జరిగితే సహించేది లేదన్నారు. ప్రభుత్వ రికార్డులు, ప్రజల పనుల పట్ల బాధ్యతారాహిత్యంగా ఉంటే చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

Next Story