- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్‌ను ఆశీర్వదించిన కేసీఆర్
కేటీఆర్‌కు అధినేత కేసీఆర్ దంపతులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి దీవించారు.

కేటీఆర్‌ను ఆశీర్వదించిన కేసీఆర్
- మొక్కలు నాటిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తన తనయుడు కేటీఆర్‌కు అధినేత కేసీఆర్ దంపతులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి దీవించారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ కలియతిరిగారు. తండ్రి కేసీఆర్ సహా తన కుటుంబ సభ్యులతో కలిసి జన్మదినం సందర్భంగా కేటీఆర్ మొక్కను నాటారు. ఈ సందర్భంగా కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు రియాన్షి ఇంకా కుటుంబసభ్యులు, ముఖ్యులు పాల్గొన్నారు. కాగా... ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్యమిస్తున్న యువతకు మద్దతుగా, వారిపైన జరుగుతున్న నిర్బంధాన్ని నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా కేటీఆర్ తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండుతో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నీట్ లీకేజీ బాధిత విద్యార్థులకు మద్దతుగా ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ అక్కడి నుండి నేరుగా ఎర్రవెల్లి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు.






