- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. ఫేమస్ బేకరీ సీజ్
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.

దిశ , గరిడేపల్లి: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కీతవారిగూడెం గ్రామంలోని ఫేమస్ బేకరీలో కుళ్లిపోయిన కేక్ విక్రయించిన ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుగా మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రామంలో గల ఫేమస్ బేకరీలో తనిఖీలు నిర్వహించి ఆహార పదార్థాల నమూనాలను సేకరించి బేకరీకి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకపోవడంతో రూ.5,000 జరిమానా విధించారు. అనంతరం గరిడేపల్లి మండల కేంద్రంలోని పంజాబీ ఫ్యామిలీ దాబాలో తనిఖీలు చేపట్టగా, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించి రూ.2,000 జరిమానా విధించారు. ఆ తర్వాత మండల కేంద్రంలోని ఫేమస్ బేకరీలో తనిఖీలు నిర్వహించిన అధికారులు పలు ఉల్లంఘనలను గుర్తించారు.
కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల తయారీ, గడువు ముగిసిన ఆహార పదార్థాల వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాల నిల్వ వంటి అంశాలు బయటపడటంతో బేకరీని వెంటనే సీజ్ చేసి అదనంగా రూ.5,000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రభాకర్, గరిడేపల్లి ఎస్సై బత్తిని శ్రీకాంత్ గౌడ్ లు మాట్లాడుతూ ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని సూచించారు. అపరిశుభ్రంగా ఆహార పదార్థాలను తయారు చేయడం, నిల్వ చేయడం లేదా విక్రయించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో కీతవారిగూడెం గ్రామపంచాయతీ కార్యదర్శి జానకి, గరిడేపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు, బిల్ కలెక్టర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.






