52 బైకులు, 5 ఆటోలు స్వాధీనం.. ఇంద్రారెడ్డి నగర్ లో కార్డన్ అండ్ సెర్చ్

by Taduka Kalyani |

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు మొకిలా పోలీస్ స్టేషన్, నార్సింగి సర్కిల్ పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్ ఫేజ్–2లో శుక్రవారం ఉదయం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

52 బైకులు, 5 ఆటోలు స్వాధీనం.. ఇంద్రారెడ్డి నగర్ లో కార్డన్ అండ్ సెర్చ్
X

దిశ, గండిపేట: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు మొకిలా పోలీస్ స్టేషన్, నార్సింగి సర్కిల్ పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్ ఫేజ్–2లో శుక్రవారం ఉదయం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు 52 బైకులు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గుట్కా ప్యాకెట్లు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను అక్కడికక్కడే వసూలు చేయడంతో పాటు, పాపిలాన్ బయోమెట్రిక్ పరికరం ద్వారా అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలను పరిశీలించి వివరాలను ధృవీకరించారు. అనంతరం చేవెళ్ల ఏసీపీ బి. కిషన్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగానికి దూరంగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొకిలా ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాస్ రెడ్డి, శంకర్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ మీర్ ముదాసిర్ అలీ, మొయినాబాద్ డీఐ సీహెచ్. ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story