- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్… బేడీలు తొలిగాయి
"ఖైదీలకు వేసే బేడీలు.. పాత జైలు గేటుకు" పేరిట దిశలో వచ్చిన కథనానికి పాత జైలు అధికారులు తక్షణమే స్పందించారు.

దిశ, సంగారెడ్డి అర్బన్ : "ఖైదీలకు వేసే బేడీలు.. పాత జైలు గేటుకు" పేరిట దిశలో వచ్చిన కథనానికి పాత జైలు అధికారులు తక్షణమే స్పందించారు. బ్రిటిష్ కాలం నాటి సంగారెడ్డి పాత జైలు గేటుకు ఇనుప సంకెళ్లను తాళంగా వేసి ఉంచడాన్ని వెలుగులోకి తీసుకురాగానే, అధికారులు వాటిని తొలగించారు. కథనం వెలువడిన 24 గంటల్లోనే చర్యలు తీసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అయితే పాత జైలు ఆవరణ మొత్తం ఇంకా గడ్డి, పిచ్చి మొక్కలతో నిండి ఉంది. దీన్ని చారిత్రక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇదే తీరు...
మరోపక్క సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో గల రూరల్ పోలీస్ స్టేషన్ గేట్లకు కూడా ఖైదీలకు వేసే బేడీలను (సంకెళ్లు)తాళం గా పెట్టారు. ఈ విషయం నిన్న ఉదయం జరగ్గా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో పోలీస్ అధికారులు హుటాహుటిన గేటుకు ఉన్న సంకెళ్లను తొలగించారు. అధికారుల నిర్లక్ష్యంతో ఖైదీలకు వేసే బేడీలు గేట్లకు తాళాలుగా వేయడం పట్ల ప్రజల నుంచి అసహనం వ్యక్తం అవుతుంది.






