- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాఖల మధ్య సమన్వయంతో ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం
కాళేశ్వరం, మంజీరా ఎల్‌ఐఎస్ భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు, మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పరిధిలో చేపడుతున్న భూసేకరణ పనులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రాజెక్టుల అమలు పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
నిర్దేశిత గడువులో భూసేకరణ పూర్తి చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత గల సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. భూసేకరణకు సంబంధించిన ప్రతి దశను నిర్దేశిత గడువులో పూర్తి చేసి, పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. భూ యజమానుల సమస్యలను చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించాలని, పరిహారం చెల్లింపులను నిబంధనల మేరకు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
శాఖల మధ్య సమన్వయం అవసరం..
రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులను వేగవంతం చేసి, రైతులకు సాగునీటి ప్రయోజనాలు త్వరగా అందేలా కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.విక్టర్, చీఫ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ ఇంజనీర్ నీటిపారుదల శాఖ, కామారెడ్డి ఆర్‌డీవో, భూసేకరణ సూపరింటెండెంట్ తోపాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






