- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం.. ఒకరు మృతి
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మరోసారి ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ కోకోవేన్ విభాగంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అనంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు.

దిశ, వెబ్ డెస్క్: వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మరోసారి ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ కోకోవేన్ విభాగంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అనంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. ఐరెన్ బార్ మీదపడటంతో అనంత్ కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే నెలరోజుల క్రితం సైతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదిమంది కార్మికులు మరణించారు. హాట్ మెటల్ విరుచుకుపడటంతో అగ్నిగోళం బద్దలై ఆ ప్రాంగణం అంతా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో మరణించిన కార్మికులు పూర్తిగా సజీవదహనం అయ్యారు. స్టీల్ ప్లాంట్ లో చరిత్రలోనే ఇది భారీ ప్రమాదంగా నిలిచింది. దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమకు రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.






