నరేందర్ రెడ్డి విజయం నేటి యువతకు స్ఫూర్తిదాయకం’: తుంబూరు దయాకర్ రెడ్డి

by Kodari Anjali |

రాకెట్ శాస్త్రవేత్త మోర్తాల నరేందర్ రెడ్డి సాధించిన విజయం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి కొనియాడారు.

నరేందర్ రెడ్డి విజయం నేటి యువతకు స్ఫూర్తిదాయకం’: తుంబూరు దయాకర్ రెడ్డి
X

దిశ, ఖమ్మం: రాకెట్ శాస్త్రవేత్త మోర్తాల నరేందర్ రెడ్డి సాధించిన విజయం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి కొనియాడారు. ‘స్కైరూట్ ఏరోస్పేస్’ ప్రయోగించిన ‘విక్రమ్-1’ రాకెట్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఖమ్మం జిల్లా వాసి నరేందర్ రెడ్డిని శుక్రవారం మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో దయాకర్ రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంతరిక్ష పరిశోధనా రంగంలో జిల్లా ఖ్యాతిని పెంచడం అభినందనీయమన్నారు. నరేందర్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు

Next Story