ఫోన్ చార్జింగ్ పెట్టగానే అలాంటి మెసేజ్..! ఎందుకు వస్తుంది?

by Javid Pasha |

ఫోన్‌లో మాయిశ్చర్ డిటెక్టెడ్ మెసేజెస్ కనిపిస్తే ఆందోళన వద్దు.. జాగ్రత్త ముఖ్యం!

ఫోన్ చార్జింగ్ పెట్టగానే అలాంటి మెసేజ్..! ఎందుకు వస్తుంది?
X

దిశ, ఫీచర్స్ : మీరు ఫోన్ చార్జింగ్ పెడుతున్నప్పుడు సడెన్‌గా స్విచ్చాఫ్ అయిపోయిందా? స్క్రీన్‌పై మాయిశ్చర్ డిటెక్టెడ్ (Moisture Detected) అనే మెసేజ్ కనిపిస్తోందా? అయితే జాగ్రత్త పడండి అంటున్నారు సాంకేతిక నిపుణులు. కొందరు ఇలాంటి మెసేజ్ చూసి తమ ఫోన్ పాడైపోయిందేమోనని ఆందోళన చెందుతుంటారు. కానీ వాస్తవానికి దాని అర్థం అది కాదని చెబుతున్నారు. మరి ఎందుకిలా జరుగుతుంది?

టెక్నాలజీ విస్తరిస్తున్న కొద్దీ స్మార్ట్ ఫోన్లలో సైతం కొత్త కొత్త భద్రతా ఫీచర్లు వస్తున్నాయి. ముఖ్యంగా IP67/IP68, గూగుల్ పిక్సెల్, వన్‌ప్లస్, పలు ఇతర వాటర్ రెసిస్టెంట్ ఫోన్లలో మాయిశ్చర్ డిటెక్టెడ్ (Moisture Detected) అనే అలర్ట్ మెసేజెస్ వస్తుంటాయి. సరిగ్గా చార్జింగ్ పెట్టే సమయానికి ఇలా ఎందుకు జరుగుతుందో తెలీక కొందరు ఇబ్బంది పడుతుంటారు. కానీ ఎలాంటి ఆందోళన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఫోన్ సేఫ్టీ సంకేతాల హెచ్చరికలో ఇదొక భాగమని చెబుతున్నారు.

ఎందుకు వస్తుంది?

*ఛార్జింగ్ పోర్ట్‌లో నీరు, ఆవిరి లేదా తేమ చేరడంవల్ల వస్తుంది

*చెమట, వర్షం, బాత్‌రూమ్ ఆవిరి, లేదా చల్లని తేమతో కూడిన వాతావరణం కారణంగా వస్తుంది

*పోర్ట్ లోపల ధూళి + తేమ కలిసి ఉండటం వల్ల కూడా వస్తుంది

*కొన్నిసార్లు సెన్సార్ ఫాల్టీ అయినప్పుడు (తప్పుడు హెచ్చరిక) వస్తుంది

ఏం చేయాలి?

*మాయిశ్చర్ డిటెక్టెడ్ (Moisture Detected) అనే మెసేజ్ మీ ఫోన్ స్ర్కీన్‌పై కనిపిస్తుంటే వెంటనే చార్జర్ తీసివేయాలి. కేబుల్ తీసి ఫోన్ ఆఫ్ చేయండి.

*ఫోన్‌ను గాలి వీచే చోట20-30 నిమిషాలు లేదా 1-2 గంటలు ఉంచాలి.

*డ్రైయర్ (హెయిర్ డ్రైయర్) కూల్ ఎయిర్ మోడ్‌లో దూరంగా ఉంచి వాడవచ్చు.

*ఫోన్ పూర్తిగా ఆరబెట్టాక చార్జింగ్ పెట్టండి. అప్పుడు కూడా మాయిశ్చర్ డిటెక్టెడ్ అనే మెసేజ్ వస్తే వేరే చార్జర్/కేబుల్ ప్రయత్నించాలి.

*ఫోన్‌ను Safe Modeలోకి మార్చి చూడండి. అయినా సమస్య కొనసాగితే సెన్సార్ ఫాల్ట్ కావచ్చు కాబట్టి సర్వీస్ చేయించాలి.

Next Story