- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 3 వేల పోస్టుల భర్తీ
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యపై దృష్టి పెట్టింది. ప్రైవేటు సెక్టార్‌లో ఇప్పటికే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగ మేళాను నిర్వహిస్తూ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తోంది....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యపై దృష్టి పెట్టింది. ప్రైవేటు సెక్టార్‌లో ఇప్పటికే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగ మేళాను నిర్వహిస్తూ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తోంది. అయితే విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి మంత్రి లోకేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే మెగా డీస్సీ నిర్వహించారు. ఇప్పుడు మరోమారు కూడా భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఖాళీలను గుర్తించారు. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
త్వరలో ఉద్యోగాల భర్తీ..
ఇందులో భాగంగా మంత్రి నారా లోకేశ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. పోలవరంలో పర్యటించిన ఆయన మరోసారి డీఎస్సీ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. మొత్తం 3 వేల టీచర్ పోస్టుల భర్తీ చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం లక్షా 10 వేల మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూల్స్‌కు వచ్చేశారని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. పలు ప్రభుత్వాల్లో నో అడ్మిషన్ పెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంచామని, ఈ మేరకు మంచి ఫలితాలు లభించాయని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.






