- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"జన నాయగన్" కు షాకింగ్ కలెక్షన్స్..ఆ సినిమాను కూడా క్రాస్ చేయలేదా !
"జన నాయగన్" కు షాకింగ్ కలెక్షన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: TN ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి సినిమా "జన నాయగన్ష. మొన్నటి సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అడ్డంకులు తొలగిపోయి... నిన్న మూవీ విడుదల అయింది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చాలా దారుణంగా ఉన్నాయని సమాచారం. తొలిరోజు ఇండియాలో రూ.48.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా రూ.78.27 కోట్లకు ఈ సినిమా కలెక్షన్స్ పరిమితం అయ్యాయని తెలుస్తోంది. లియో, బీస్ట్, గోట్ సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ ను ఈ సినిమా దాటలేదు. సినిమా రిలీజ్ ఆలస్యం కావడం.. ఇంటర్నెట్ లో హెచ్ డీ ప్రింట్ లీక్ కావడం, మూవీ అంతగా ఆకట్టుకోకపోవడం, తెలుగులో వచ్చిన బాలయ్య మూవీకి రీమేక్ గా రావడం వల్ల సినిమాకు పెద్దగా కలెక్షన్స్ రావడం లేదని అంటున్నారు. కాగా ఈ సినిమాలో విజయ్ హీరోగా చేయగా పూజా హెగ్డే హీరోయిన్ గా మెరిశారు. మమితా బైజు కూడా స్పెషల్ రోల్ లో కనిపించారు.






