- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పశువులను రోడ్లపై వదిలేస్తే గోశాలకు తరలిస్తాం
by Taduka Kalyani |
పట్టణంలోని రోడ్లపై పశువులను వదిలేస్తే గోశాలలకు తరలిస్తామని, వారం రోజుల సమయం ఇస్తున్నామని మంచిర్యాల నగర పాలక సంస్థ కమిషనర్ అన్వేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

X
దిశ, మంచిర్యాల టౌన్ : పట్టణంలోని రోడ్లపై పశువులను వదిలేస్తే గోశాలలకు తరలిస్తామని, వారం రోజుల సమయం ఇస్తున్నామని మంచిర్యాల నగర పాలక సంస్థ కమిషనర్ అన్వేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని కొంతమంది పశువుల యజమానులు తమకు చెందిన ఆవులు, గేదెలను పట్టణ పరిధిలో విచ్చలవిడిగా వదిలివేయడం వలన, ప్రధాన రహదారులు, పురవీధుల్లో సంచరిస్తూ పాదచారులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, పశువుల యజమానులు తమకు చెందిన ఆవులు, గేదెలను నేటి నుంచి వారం రోజులలోపు తప్పనిసరిగా తమ స్వంత ఆవరణలో లేదా తగిన సురక్షిత ప్రదేశంలో ఉంచుకోవాలని కోరారు. వారంలోగా తీసుకెళ్లక పోతే వాటిని పట్టుకొని, గోశాలలకు తరలిస్తామన్నారు. నగరంలో ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించవలసిందిగా కోరారు.
Next Story






