- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీలో హెల్త్ కేర్ సబ్జెక్టు అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
హెల్త్ కేర్ సబ్జెక్టు నందు ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి అర్హతలు గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెల్త్ కేర్ సబ్జెక్టు నందు ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి అర్హతలు గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ టి. వేణుగోపాల స్వామి శుక్రవారం తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 27వ తేదీ వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్‌లో దరఖాస్తులు చేసు కోవాలన్నారు. ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్ నందు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు పీజీ హెల్త్ కేర్/ M.Sc (Microbiology) / M.Sc (Biotechnology) / M.Sc (Biochemistry) లో 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, అదే విధంగా NET/SET/Ph.D అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అనుభవం ఉన్న అభ్యర్థులకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడు తుందని చెప్పారు. అర్హత, అనుభవంలను ధృవీకరించే ఒక సెట్ జిరాక్స్ కాపీలను సమర్పించాలని, ఈ నెల 28వ తేదీన ఉదయం ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.






