అఖండ భగవన్నామంతో మార్మోగిన పాండురంగ ఆశ్రమం

by Taduka Kalyani |

పాండురంగ ఆశ్రమంలో 95వ ఆశాడి త్రిరాత్రోత్సవాలు శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

అఖండ భగవన్నామంతో మార్మోగిన పాండురంగ ఆశ్రమం
X

దిశ, ములుగు : పాండురంగ ఆశ్రమంలో 95వ ఆశాడి త్రిరాత్రోత్సవాలు శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజ, పుణ్యాహవాచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా, అనంతరం అఖండ భగవన్నామ సంకీర్తన ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిరంతరాయంగా భగవన్నామం కొనసాగనుంది. రుక్మిణి పాండురంగ స్వామివారికి క్షీరాభిషేకం, పురుషసూక్త విధాన పూజలు, విశేష పుష్పార్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదం, అన్నప్రసాదం స్వీకరించారు. అనంతరం హరికథ, రామాయణ గానం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, కథాగానాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మాజీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, స్థానిక సీఐ, ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు, అలంకారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉపవాస దీక్షలో ఉన్న భక్తులకు ఉపాహారం, తేనీరు ఏర్పాటు చేయడంతో పాటు వారాంతంలో వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు.

Next Story