- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెట్ల తొలగింపు మీద ఉన్న శ్రద్ధ.. ఆకు తొలగింపు మీద లేదాయే..!
మండల వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ పనులు ఊపందుకున్నాయి.

దిశ, వలిగొండ: మండల వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ పనులు ఊపందుకున్నాయి. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై దుక్కులు దున్ని, నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భూమిని తడపడానికి నారుమడులను నీటి అవసరం ఎంతో ఉంది. కానీ మండల వ్యాప్తంగా కాలువలను పేరుకుపోయిన గుర్రపు డెక్క కారణంగా నీటి సరఫరా లేక రైతులు పంట సాగుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మండలంలోని ఆసిఫ్ నగర్ కాలువలో గుర్రపు డెక్క ఆకు పేరుకుపోయి పంట పొలాలకు నీరు చేరడం లేదు. సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు ఇదంతా గమనిస్తున్నప్పటికీ చూసి చూడనట్టుగా, అమ్మకి ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గత 15 రోజుల క్రితం ఇరిగేషన్ అధికారుల పర్మిషన్ తో కొంతమంది కాలువలు వంగిన చెట్లకు పర్మిషన్ తెచ్చుకుని ఏపుగా పెరిగిన చెట్లను నరికి తీసుకెళ్లారు.
ఇప్పటికైనా రైతుల బాధలు తీర్చడానికి..
కాలువ గట్ల వెంట ఉన్న తుమ్మ చెట్ల వల్ల ఎటువంటి హాని కానీ, ఇబ్బందులు కానీ లేవు అయినా అధికారులు ఎంతో శ్రద్ధ వహించి వాటి తొలగింపుపై శ్రద్ధ ఉంచారు. కానీ కిలోమీటర్ల మేర గుర్రపు డెక్క ఆకు అడ్డుగా నిలిచి పంట పొలాలకు నీరు అందకుండా ఉంటే మాత్రం వారికి పట్టదు. గుర్రపు డెక్క ఏపుగా పెరగడంతో నీరు ఎక్కడికక్కడ స్తంభించిపోయి నీటి మట్టం పెరిగి కాలువగట్లకు గళ్ళు పడే ప్రమాదం దాపురించినా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్లక్ష్య ధోరణి కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆసిఫ్ నగర్ కత్వ పై బాగాన గత రెండు మూడు సంవత్సరాల నుండి గుర్రపు డెక్క చెత్తాచెదారంతో నిండిపోయి గేట్లు తెరవడానికి మూసి వేయడానికి వీలు లేకుండా పోయినా పట్టించుకునే నాధుడు మాత్రం కరువయ్యాడు. అదే విధంగా భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి వద్ద ఉన్న కల్వర్టు వద్ద రెండు, మూడు సంవత్సరాల నుండి కల్వర్టు దిమ్మెలు అడ్డుగా ఉండటం వల్ల అర కిలోమీటర్ దూరం చెత్తాచెదారం పేరుకుపోయి దిగువకు నీరు పారడం లేదు. ఎందరో ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు రహదారిగుండా వెళ్లినా... ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా రైతుల బాధలు తీర్చడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వెంటనే గుర్రపుట్టిక్క ఆకును తొలగించి దిగువ ప్రాంతాలకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.






