- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసముద్రం ప్రజ్వల్ రైస్ మిల్లులో అధికారుల తనిఖీలు
by Ratna Kumari |
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపల్ పరిధిలోని ప్రజ్వల్ రైస్ మిల్లులో సంబంధిత శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.

X
దిశ, కేసముద్రం : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపల్ పరిధిలోని ప్రజ్వల్ రైస్ మిల్లులో సంబంధిత శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. తనిఖీల సందర్భంగా మిల్లు రికార్డులు, ధాన్యం నిల్వలు, బియ్యం నిల్వలు, ప్రభుత్వ నిబంధనల అమలు తదితర అంశాలను అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. అయితే, ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ విషయమై ఉన్నతాధికారులను సంప్రదించగా, తనిఖీలు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. తనిఖీలకు గల కారణాలు, గుర్తించిన అంశాలు, తీసుకోనున్న తదుపరి చర్యలపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
Next Story






