భారత్‌లో యాషెస్‌ టెస్టు మ్యాచ్‌!

by velandi.Saikiran |   (  Updated:2026-07-24 10:11:24  IST  )

భారత్‌లో యాషెస్‌ టెస్టు మ్యాచ్ నిర్వ‌హించే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి.

భారత్‌లో యాషెస్‌ టెస్టు మ్యాచ్‌!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య క్రీడా సంబంధాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే బిగ్ బాష్ లీగ్ 2026 నేపథ్యంలో తొలి మ్యాచ్ చెన్నైలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన కూడా వచ్చింది. అయితే యాషెస్ సిరీస్ మ్యాచ్ లు కూడా ఇండియాలో జరిగే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు తలపడతాయి. వాస్తవానికి ఈ టోర్నమెంట్ జరిగితే, ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్ లో నిర్వహించాలి.

కానీ త్వరలో జరగబోయే యాషెస్ సిరీస్ ను ఇండియాలో నిర్వహించేలా సన్నద్ధం అవుతున్నారట. ఈ మేర‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ప‌రిశీల‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్ బర్గ్ మాట్లాడుతూ ఇండియాలో యాషెస్ సిరీస్ నిర్వహించడంపై అన్ని ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇంగ్లాండ్ తో పాటు బీసీసీఐతో కూడా తమకు మంచి సంబంధాలు ఉన్నాయని వివరించారు. ఇండియాలో యాషెస్ సిరీస్ నిర్వహించే దానిపైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అన్ని కుదిరితే కచ్చితంగా జరుగుతుందని వివరించారు. యాషెస్ సిరీస్ లో ఒక్క టెస్ట్ అయినా నిర్వ‌హించేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు వివ‌రించారు.

Next Story