ప్రజలంతా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

by Taduka Kalyani |

ప్రజలంతా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి, అవగాహన కలిగి ఉండాలని చెన్నూర్ రూరల్ సిఐ క్రిష్ణ అన్నారు.

ప్రజలంతా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
X

దిశ : వేమనపల్లి : ప్రజలంతా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి, అవగాహన కలిగి ఉండాలని చెన్నూర్ రూరల్ సిఐ క్రిష్ణ అన్నారు. గురువారం ఆయన మండలంలోని గొర్లపల్లిలో నీల్వాయి ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, గ్రామంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, గ్రామంలో తనిఖీలు చేపడుతున్న సమయంలో 2 లీటర్ల గుడుంబా, 250 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశామని, అక్రమంగా గుడుంబా తయారు చేసిన, విక్రయించిన కేసులు నమోదు చేస్తామని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ఇతర పత్రాలను కలిగి ఉండాలని అన్నారు. గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడితే పోలిసులకు సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, సర్పంచ్ కొట్రాంగి శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

Next Story