T20 క్రికెట్ లో మ‌రో సంచ‌ల‌నం..గేల్ రికార్డ్ బ‌ద్ద‌లు

by velandi.Saikiran |

T20 క్రికెట్ లో మ‌రో సంచ‌ల‌నం. గేల్ రికార్డ్ ను బట్ల‌ర్ బ‌ద్ద‌లు కొట్టారు.

T20 క్రికెట్ లో మ‌రో సంచ‌ల‌నం..గేల్ రికార్డ్ బ‌ద్ద‌లు
X

దిశ‌, వెబ్ డెస్క్: టీ20 క్రికెట్ లో మరో సంచలన రికార్డు నమోదు అయింది. అంతర్జాతీయ, లీగ్స్ టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జోస్ బట్లర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఏకంగా 14,572 పరుగులు సాధించి, రెండవ స్థానానికి ఎగబాకాడు. ఈ తరుణంలో క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ వేదిక‌గా హండ్రెడ్ లీగ్ జరుగుతోంది. ఇందులో మాంచెస్ట‌ర్ సూపర్ జెయింట్స్‌ తరఫున 16 పరుగులు చేసిన నేపథ్యంలో ఈ ఫీట్ నమోదు చేసుకున్నాడు. అటు టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కీరన్ పొలార్డ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.

T20 చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్లు:

14803 - కీరన్ పొలార్డ్ (663 ఇన్నింగ్స్)

14572 - జోస్ బట్లర్ (487)

14562 - క్రిస్ గేల్ (455)

14449 - అలెక్స్ హేల్స్ (523)

14284 - డేవిడ్ వార్నర్ (438)

14218 - విరాట్ కోహ్లీ (413)

Next Story