కాక్రోచ్ జనతా పార్టీతో మోడీకి గండమే.. సంచలన జోస్యం చెప్పిన వేణు స్వామి

by Ajay Maddhiboyina |

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్ పై జ్యోస్యం చెప్పారు. లఘ్న కుండలి ప్రకారం సీజేపీ పార్టీ జోతిష్యంలో బుధాదిత్య యోగం కనిపిస్తుందన్నారు.

కాక్రోచ్ జనతా పార్టీతో మోడీకి గండమే.. సంచలన జోస్యం చెప్పిన వేణు స్వామి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్ పై జ్యోస్యం చెప్పారు. లఘ్న కుండలి ప్రకారం సీజేపీ పార్టీ జోతిష్యంలో బుధాదిత్య యోగం కనిపిస్తుందన్నారు. అందువల్లే పార్టీకి విపరీతమైన క్రేజ్, అటెన్షన్ వస్తున్నాయని చెప్పారు. కాలసర్ప సహిత రాజయోగం కనిపించిన పార్టీ సీజేపీ అన్నారు. 2026 అక్టోబర్ 31 వరకు ఈ పార్టీకి విపరీతమైన క్రేజ్ ఉంటుందని చెప్పారు. తరవాత మరోవిధమైన క్రేజ్ వస్తుందని తెలిపారు. రాశిచక్రం పరిశీలిస్తే విపరీతమైన రాజయోగం కనిపిస్తుందన్నారు. వీరిని అణచివేయాలని చూస్తే రివర్స్ అవుతుందని అన్నారు.

కాబట్టి చాలా పద్ధతిగా వీరిని హ్యాండిల్ చేయాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతాపార్టీ డిమాండ్ చేస్తుందని.. వందకు వందశాతం ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందన్నారు. సీజేపీ పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్యులు తరవాత జైలుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. సీజేపీ ధర్మం గురించి పట్టించుకోకుండా మరో మార్గంలో వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ పార్టీవల్ల నరేంద్రమోడీ, బీజేపీకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే కాలంలో ఒక పార్టీని గద్దెను ఎక్కించాలన్నా.. దించాలన్నా సీజేపీ ప్రభావం చూపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

Next Story