వివాహేతర సంబంధానికి నో చెప్పిన మహిళ.. విచక్షణారహితంగా దాడి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-24 12:55:40  IST  )

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి సహకరించలేదనే కోపంతో తల్లీకూతుళ్లపై ఓ వ్యక్తి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు....

వివాహేతర సంబంధానికి నో చెప్పిన మహిళ.. విచక్షణారహితంగా దాడి
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా తోట్లవల్లూరు దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి సహకరించలేదనే కోపంతో తల్లీకూతుళ్లపై ఓ వ్యక్తి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి కొంతకాలంగా మహిళను వేధిస్తున్నారు. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే సదరు మహిళ తిరస్కరించారు. దీంతో వారిపై నాగేంద్ర తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. భౌతిక దాడికి దిగాడు. మహిళతో పాటు ఆమె కుమార్తెపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కేకలు విన్న స్థానికులు వెంటనే స్పందించారు. గాయాలతో ఉన్న వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తల్లీకూతుళ్ల నుంచి ప్రాథమిక వాంగ్మూలాన్ని సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాగేంద్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి అనంతరం పరారైన నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story