నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం.. ఆరుగురిపై క్రిమినల్ కేసులు

by Ajay Maddhiboyina |

న‌కిలీ నంబ‌ర్ ప్లేట్లు, అన‌ధికారిక రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్ ప్లేట్ల‌ను ఉప‌యోగించే వాహ‌నాల‌పై హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

నకిలీ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం.. ఆరుగురిపై క్రిమినల్ కేసులు
X

దిశ‌, వెబ్ డెస్క్: న‌కిలీ నంబ‌ర్ ప్లేట్లు, అన‌ధికారిక రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్ ప్లేట్ల‌ను ఉప‌యోగించే వాహ‌నాల‌పై హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ట్రాఫిక్ ఆంక్ష‌లు త‌ప్పించుకునేందుకు, ఇతర కారణాల వల్ల కొందరు వాహనాల నంబర్ ప్లేట్లు మార్చి నగరంలో యథేచ్ఛగా తిరుగుతున్నారు. అలాంటి వాహనాలను గుర్తించి గత వారంలో ఐదు పోలీస్ స్టేషన్లలో ఆరుగురిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుండి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేసిన పోలీస్ స్టేషన్లలో జూబ్లిహిల్స్, మలక్ పేట్, బేగంబజార్, అబిడ్స్, కాచిగూడ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.

ప్రభుత్వం ఆమెదించిన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు మాత్రమే వినియోగించాలని పోలీసులు హెచ్చరించారు. నంబర్లు మార్చడం, స్టిక్కర్లు అతికించడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. నంబర్ ప్లేట్ మార్చినా, నంబర్ మార్చినా తక్షణమే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞ‌ప్తి చేశారు. నంబ‌ర్ ప్లేట్లు మార్చిన వాహ‌నాలు స్వాధీనం చేసుకునేందుకు స్పెష‌ల్ డ్రైవ్ నిరంత‌రాయంగా కొన‌సాగుతుంద‌ని చెప్పారు.

Next Story